లోక్‌సత్తా పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం మృగ్యమైన ఈ రోజుల్లో లోక్‌సత్తా పార్టీ పూర్తి ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపబోతోంది. జనవరి 4,5,6,7 తేదీల్లో ఈ ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది.
రాష్ట్ర అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుడు, డివిజను అధ్యక్షుడు మొదలైనవారిని ఈ ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు.
డిసెంబరు 21 వ తేదీ ఆదివారం నాడు, కూకట్‌పల్లి డివిజను అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి అధికార ప్రతినిధి, కృష్ణారెడ్డి వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నిజోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పార్టీ సాధిస్తున్న పురోగతిని సమీక్షించారు. సంస్థాగత ఎన్నికల ప్రాముఖ్యాన్ని సభికులకు వివరించారు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రచారం కోసం పార్టీ చేపట్టవలసిన వ్యూహాలను కూడా చర్చించారు.
లోక్‌సత్తా కూకట్‌పల్లి యొక్క టపా